Sunday, 26 April 2020

'క్రాక్'లో కటారి.. సర్‌ప్రైజ్ చేసిన రవితేజ టీమ్

మాస్ మాహారాజా రవితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''. గతంలో రవితేజతో ''డాన్‌ శీను, బలుపు'' లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మ‌లినేని.. మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టానని ఈ మూవీ టైటిల్ పోస్టర్ ద్వారానే హింట్ ఇచ్చేశారు. ‘క్రాక్’ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందింది. కాగా తాజాగా ఈ రోజు (ఏప్రిల్ 26) యాక్టర్ పుట్టినరోజు కానుకగా ఆయన లుక్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. సముద్రఖనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రాక్ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు ‘కటారి’ అని తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే ఆయన లుక్ గంభీరంగా ఉంది. ఈ పోస్టర్ చూస్తూనే 'క్రాక్'లో రవితేజతో పోటీపడి ఆయన నటిస్తున్నాడని స్పష్టమవుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. జయమ్మగా ఆమె అదరగొట్టేయనుంది. మొత్తానికైతే పోస్టర్స్ తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది క్రాక్ టీమ్. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా నటిస్తుండగా, ఆయన సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ డేట్‌లో రావడం కష్టమే అని తెలిసింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y86D9c

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk