Sunday 26 April 2020

35 మందికి జీతాలివ్వాలి.. అంత డబ్బు లేకపోవడంతో: విజయ్ దేవరకొండ

సినీకార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ఏర్పాటుచేశారు. దీనికి చాలా మంది నటీనటులు, నిర్మాతలు విరాళాలు అందజేశారు. అలాగే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కూడా టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్లు విరాళాలు ఇచ్చారు. అయితే, విజయ్ దేవరకొండ మాత్రం ఏ చారిటీకి విరాళాలు ఇవ్వలేదు. దీనిపై కొంత మంది సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, దీనికి గల కారణాల గురించి, తాను చేయబోయే సహాయ కార్యక్రమాల గురించి తాజాగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. తన ఫౌండేషన్ ద్వారా మొత్తంగా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చుచేయనున్నట్టు వెల్లడించారు. ‘‘ఈ పరిస్థితికి కారణమైన దాని పేరు కూడా చెప్పాలని లేదు. విని విని చిరాకు వచ్చేసింది. కానీ, ఇది మనందరినీ గట్టిగా కొట్టింది. నన్ను కూడా. నేను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేను. చూస్తే అకస్మాత్తుగా అకౌంట్‌లో డబ్బులు లేవు. నా కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు నా దగ్గర పనిచేసే 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించే బాధ్యత నాపై ఉంది. డబ్బులు లేకపోవడం కొత్తేమీకాదు.. అలవాటే. పడిపడి లేచా. కానీ, ఇలా 35 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్లకి జీతాలు ఇవ్వడం నాకు కొత్త. ‘కింగ్ ఆఫ్ ద హిల్’ నిర్మాణ సంస్థ పెట్టడం వల్ల, సామాజిక సేవా సంస్థను ప్రారంభించడం వల్ల నా వ్యక్తిగత సిబ్బంది, ఉద్యోగులు పెరిగారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి జీతాలు ఇవ్వడం నా బాధ్యత. గడిచిన నెల రోజులు నేను డబ్బులు సర్దుకోవడానికే సమయం సరిపోయింది’’ అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. Also Read: అయితే, తాను ఇంటిలో బాగానే ఉన్నానని.. కానీ, బయటికి వెళ్లినప్పుడు ఎంతో మంది ఇబ్బందులు పడటం చూశానని అన్నారు విజయ్. వారి గురించి ఆలోచిస్తుంటే అసలు నిద్ర పట్టడంలేదని.. వాళ్లకు ఏమైనా చేయాలని అనిపిస్తోందని చెప్పారు. అందుకే, ఈరోజు రెండు భారీ ప్రకటనలు చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నానంటూ తాను చేయబోయే మంచి పనులను వివరించారు. దేవేరకొండ ఫౌండేషన్ నుండి యూత్‌కి ఎంప్లాయిమెంట్ ‘‘ఈ లాక్‌డౌన్ పూర్తి అయ్యాక ప్రతి సామాన్య మనిషికి ఎంప్లాయిమెంట్ సమస్య మొదలు కాబోతోంది. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మన ముందు ఉన్న ప్రశ్న. గత సంవత్సరం నుండి నా టీమ్ నేను కలిసి ఎంప్లాయిమెంట్‌కు సంబంధించి కొన్ని వ్యూహాలు రచించాం. ఒక లక్ష మందికి నేను ఉపాధి కల్పించాలనేది నా లక్ష్యం. అందులో మొదటగా 50 మంది స్టూడెంట్స్‌ను హైదరాబాద్ పిలిపించి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చాం. ఈ లాక్‌డౌన్ అందరూ ఉద్యోగాల్లో చేరలేదు. ఇద్దరు విద్యార్థులకు మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది. మిగిలిన వారందరికీ ఎంప్లాయిమెంట్ దొరకబోతోంది. ఈ ‘‘యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్’’ కోసం ది దేవరకొండ ఫౌండేషన్ తరుఫున కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం’’ అని విజయ్ వెల్లడించారు. మిడిల్ క్లాస్ ఫండ్.. ‘‘ఈ పరిస్థితుల్లో పేద వాళ్ళని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చాలా సపోర్ట్‌గా ఉంది. కేసీఆర్ గారు ప్రజల పట్ల తీసుకున్న జాగ్రత్రలు హర్షించదగ్గవి. కానీ, మధ్య తరగతి ప్రజలు కూడా చాలా ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ‘మిడిల్ క్లాస్ ఫండ్’ అని 25 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాం. సామాన్య మధ్య తరగతి వారికి హెల్ప్ అయ్యే విధంగా ఈ డబ్బును ఖర్చు పెట్టబోతున్నాం. ఎవరికైనా అత్యవసర సహాయం కావాలంటే https://ift.tt/2W0QO1k వెబ్‌సైట్‌లో మీ వివరాలు తెలియజేస్తే మా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ నుండి మీకు సహాయం అందుతుంది. ప్రభుత్వం నుండి లబ్ది పొందలేని వారు, రేషన్ కార్డ్ లేని వారు ఈ హెల్ప్ తీసుకోవచ్చు’’ అని విజయ్ దేవరకొండ తెలిపారు. మరిన్ని వివరాలు కింది వీడియోలో తెలుసుకోవచ్చు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eRVHCv

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz