తెలుగు సినిమా స్థాయిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ రచయిత, నటుడు . మిగతా ఇండస్ట్రీలతో తెలుగు సినిమా పోటీపడలేకపోవడానికి ప్రధాన కారణం డబ్బులు పెట్టే నిర్మాతలే అన్నారాయన. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవితో సహా అందరికీ కూడా మంచి క్లాసిక్ సినిమా చేయాలని ఉంటుంది.. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే.. నిర్మాతల దగ్గరే. కొన్ని కోట్ల రూపాయల డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ డబ్బు నాకు వెనక్కి వస్తుందా? రాదా? అనే లెక్కల్లోనే తేడా వస్తుంది. ఇంకా మలయాళ సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ తెలుగు సినిమాలో చూస్తారా లేదా అన్న భయం అందుకే ఆ స్థాయిలో సినిమాలు ఉండటం లేదు. మనకి కొలిమి కారం తినడం అలవాటు అయిపోయింది.. కొత్తిమీర పచ్చడి తింటే చప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్లు ఎంత మంచి కాన్సెప్ట్‌లు తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రావడం వల్ల మనం ఏదైనా తీయొచ్చు అనే స్వేచ్ఛ వచ్చింది.. దీని వల్ల క్రియేటివిటీ పొంగులు తొక్కుందనేది నా అభిప్రాయం. దీనివల్ల మంచి జరగొచ్చు. ఇప్పుడు పారసైట్ సినిమా చూశాం అబ్బా.. ఆహా అనుకున్నాం.. కాని ఈ సినిమా మన విరాట పర్వమే. కాని తెరకెక్కించిన తీరు ఎంత బాగుంది. కథలు మనకు లేక కాదు.. టాలెంట్ లేక కాదు.. కాకపోతే కమర్షియల్ అంశాలు, బడ్జెట్ తదితర అంశాల బేరీజు వేసుకోవడంతో సినిమా కళ తప్పుతుంది’ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తనికెళ్ల భరణి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yP1FDI
No comments:
Post a Comment