Sunday, 26 April 2020

రామ్ కొత్త లుక్ ... అచ్చం టీనేజ్ కుర్రాడిలానే

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని... దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ మధ్య సరైన సినిమాలు లేని రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ సినిమా చేస్తున్నాడు. రామ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు. నిత్యం నెటిజన్స్‌తో టచ్‌లో లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. తాజాగా రామ్ తన లేటెస్ట్ పిక్ అభిమానులకు షేర్ చేశాడు. ఈ ఫోటో రామ్ ఎలాంటి మీసాలు, గడ్డాలు లేకుండా... క్లీన్ షేవ్‌లో కనిపించాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. తాజాగా రామ్ సరికొత్త లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. క్లీన్ అండ్ నీట్ షేవ్ లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. మీసం కూడా లేకుండా ఉన్న రామ్ ని చూస్తుంటే టీనేజ్ బాయ్ లా గ్లామర్ అండ్ హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఈ లుక్ చూసిన రామ్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా లాక్ డౌన్ నడుస్తుండడం తో సామాన్య ప్రజలతో పాటు సినీ స్టార్స్ సైతం ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతూ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక రామ్ ఫోటోను పోస్టు చేస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయండి అంటూ ఓ మెసేజ్ కూడా పెట్టాడు. ఇక రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా డిజిటల్‌లో రిలీజ్ అవుతుందని ఆ మధ్యవార్తలు వచ్చినా వాటిని రామ్ కొట్టిపారేశాడు. తన సినిమా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ కూడా ఇచ్చాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eR8Pb8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....