Sunday, 26 April 2020

చిరంజీవి కూతురు శ్రీజ వల్లే ఇదంతా.. మ్యాటర్ మొత్తం చెప్పేసిన నిహారిక

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులు అందరినీ ఇళ్లలోనే కట్టిపడేశాయి. ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బాధ్యత భుజాలపై వేసుకున్నారు. హీరోలంతా 'బీ ది రియల్ మెన్' అంటూ ఇంట్లో లేడీస్‌కి సాయపడాలని చెబుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్‌పై కన్నేసి ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ అమ్మాయిలంతా కలిసి 'పాస్ ది బ్రష్' అంటూ "మేకప్ వేసుకోక ముందు, వేసుకున్న తరువాత కనిపిస్తూ డాన్స్ చేశారు''. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లతో పాటు నాగబాబు కూతురు , అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సహా ఇంకొందరు మెగా ఫ్యామిలీ లేడీస్ పాల్గొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో వైరల్ అయింది. చాలామంది లేడీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో రూపొందించడానికి కారణం అక్కే అని చెప్పింది నిహారిక. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న మెగాడాటర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచడమే గాక, పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని విషయాలపై స్పందిస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ మెగా మేకప్ ఛాలెంజ్ ఆలోచన ఎవరిది? మీకెందుకు చేయాలనిపించింది? అనే ప్రశ్నపై స్పందించిన నిహారిక.. తమకు ఆ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పుకొచ్చింది. తమ ఫ్యామిలీ లేడీస్ వాట్సాప్ గ్రూప్‌లో శ్రీజ షేర్ చేసిన ఓ వీడియో చూశాక ఈ మేకప్ ఛాలెంజ్ చేయాలనే ఆలోచన వచ్చిందని నిహారిక తెలిపింది. హిందీలో ఉన్న ఆ మేకప్ వీడియోను తెలుగులో చేస్తే బాగుంటుందని భావించి మెగా ఫ్యామిలీ లేడీస్ అందరినీ ఒప్పించి ఈ ఛాలెంజ్‌లో భాగం చేశామని ఆమె తెలిపింది. వీడియో చేద్దామనగానే అందరూ రెడీ అన్నారు కాకపోతే విద్యా మాధురి అక్క మాత్రం కాస్త సతాయించి చివరకు ఓకే అనిందని చెప్పింది. ఒక్కొక్కరి క్లిప్పింగ్స్ తీసుకొని ఎడిట్ చేసి చివరకు ఈ వీడియో రెడీ చేశామని తెలిపింది నిహారిక. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355Tr6j

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd