Sunday 26 April 2020

దేశాధ్యక్షుడి విషయమై వర్మ షాకింగ్ కామెంట్స్.. అతని కంటే కిరాతకమైన వ్యక్తి ఆమెనే!!

ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జనం నోళ్ళలో నానడం రామ్ గోపాల్ వర్మ నైజం. ఏ సందర్భాన్నైనా తనదైన కోణంలో విశ్లేషిస్తూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి వర్మ.. తాజాగా నార్త్ కొరియా దేశాధ్యక్షుడి విషయమై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. గత కొన్నిరోజులుగా నార్త్ కొరియా అధ్యక్షుడు మరణించాడనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆయన స్థానంలో అతని సోదరి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు చూసిన వర్మ, తన క్రియేటివిటీకి పదును పెడుతూ ట్వీట్ చేశారు. ''కిమ్ జంగ్ ఉన్ మరణించారని, అతని స్థానంలో ఆయన సోదరి అధికార బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె కిమ్ కంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని భావిస్తున్నా. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తంలో ఫస్ట్ లేడీ విలన్‌ ఆమెనే అవుతుంది. ఇంకా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ అయినట్లే'' అని పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ ట్వీట్‌ చూసి నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ''లేడీ విలన్ మీకు ఇష్టమేగా పండగ చేసుకోండి, నిప్పు రాజేయాలంటే మీ తర్వాతే, అప్పుడే కన్ను పడిందా నీకు.. ఇండియా కాదు అని కొరియాకు వెళ్ళిపోయావా వర్మ, ఎవరినీ వదలవా సామీ.. రూమర్ అని ముందే చెప్పి మళ్ళీ ఆ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావేంటి సారూ'' అంటూ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఆర్జీవీ నెక్స్ట్ సినిమాకు పాయింట్ దొరికేసిందని కామెంట్ చేస్తుండటం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358JRj1

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz