Saturday 25 April 2020

అమల మాటలను సీరియస్‌గా తీసుకున్న సమంత! షాకిచ్చేలా పోస్ట్..

పెళ్ళికి ముందే స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్న .. నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని కోడలిగా బ్రాండ్ తెచ్చుకొని తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది. అక్కినేని వారింట అందరికంటే యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ వరుస విజయాలందుకుంటోంది. అయితే అనుకోకుండా లాక్‌డౌన్ రావడంతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమై తమ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కినేని నాగార్జున భార్య అమల. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ.. అక్కినేని వారింట్లో ఆడవాళ్లు వంటగదికి దూరంగా ఉంటారని చెప్పింది. అంతేకాదు తన భర్త నాగార్జున వంట బాగా చేస్తారని తెలిపింది. అత‌నుండ‌గా ఇంకెవరూ వంట చేయాల్సిన అవసరం లేదని అనేసింది. ఇలా అనడంతో, పరోక్షంగా కోడలు సమంతనే టార్గెట్ చేసిందని, సమంతను ఉద్దేశించే అలా మాట్లాడిందని టాక్ ముదిరింది. దీంతో సమంత వంట మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు అత్త అమల మాటలు సీరియస్‌గా తీసుకుందో లేక తాను వంట చేయగలనని చెప్పాలనుందో తెలియదు గానీ.. సమంత గరిటె తిప్పింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అత్త మాటలను తిప్పికొట్టింది. ట్రప్ఫెల్ మస్రూమ్‌ పాస్తాను తయారు చేసి ఆ పిక్స్ అందరితో పంచుకుంది సామ్. దీంతో సమంత కావాలనే అమలకు కౌంటర్ వేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. చూద్దాం మరి.. ఈ వార్తలపై అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో!. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aAa4YZ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz