Saturday, 25 April 2020

ఎస్.. డబ్బు విషయంలో గట్టిగానే ఉంటా.. లేకుంటే ఆ 23 పెళ్లిళ్లు చేయగలిగేవాడినా?: బ్రహ్మానందం

జీవితంలో డబ్బు సంపాదించడమే కాదు.. దాన్ని తగిన రీతిలో వాడటమూ అంతే ముఖ్యం అని అన్నారు హాస్య బ్రహ్మ . డబ్బువిలువ ఏంటో తనకు తెలుసు కాబట్టే జాగ్రత్త ఉంటానని.. అందుకే కసితో డబ్బు సంపాదించానన్నారు. అయితే తనను చాలా మంది డబ్బు విషయంలో చాలా గట్టిగా ఉంటానని అంటుంటారని వాళ్లకు నా సమాధానం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సామాన్యులు పడుతున్న కష్టాలపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తను డబ్బు విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉంటానో చెప్పుకొచ్చారు. ‘జీవితంలో మిగితా విషయాలను పక్కనపెడితే.. మన చలన చిత్ర సీమలో డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు ఉన్నారు. నేను చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కాని.. ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నా. డబ్బు విషయంలో నేను గట్టిగా లేను అని అనుకుందాం.. రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏంటి? దీన్ని నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటాను. అలా ఇచ్చాను నేను 23 మంది ఆడపిల్లలకు నా చేతులతో పెళ్లి చేయించగలిగాను. నేను ఆ ఆడ పిల్లలకు పెళ్లి చేయకపోతే.. వాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదు కాని.. అసలు నేను ఎవర్ని వాళ్లకు ఇవ్వడానికి. గ్లోబు భగవంతుడు ఇస్తే అది అందరిదీ.. మనం ఒకడికి ఇస్తున్నాం.. వాడు మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు, వాడికి మనం సహాయం చేస్తున్నాం.. ధర్మం చేస్తున్నాం.. ఇలాంటి పిచ్చి మాటలు.. మన డిక్షనరీలో ఉండకూడదు. ఇది నా అభిప్రాయం. ఏదో నువ్ సాయం చేస్తున్నావ్ కదా అని ఫొటో తీసి చూపిస్తే.. అతడి లేనితనంతో పాటు సహాయం చేసేమనే విర్రవీగే ముఖకవళికలు కనిపిస్తుంటాయి. ఇవి నాకు ఇష్టం ఉండదు. అందుకే రూపాయి అనేది ఎటువంటి పేదరికం నుంచి ఉద్భవించిందో నాకు తెలుసు కాబట్టి. దాని విలువే కాబట్టి. అది తలచుకుంటే ఎంత నరకం చూపిస్తుందో కూడా నాకు తెలుసు. కోటీశ్వరుడు నిద్ర లేకుండా గడుపుతుంటాడు.. రిక్షాతొక్కేవాడు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు. నా అభిప్రాయంలో ఆ రిక్షాతొక్కేవాడే కోటీశ్వరుడు. డబ్బు అనేదే ప్రధానం కాదు’ అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VCYyaS

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...