ప్రేక్షకులకు ఈ మధ్య క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు బాగా నచ్చతున్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు డైరెక్టర్లు, హీరోలు కూడా అలాంటి సినిమాలు చేయడంపైనే మక్కువ చూపిస్తున్నారు. రాజశేఖర్ కల్కి సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు, సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రహ్మణ్యపురం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మరోవైపు కూడా ఇలాంటి సినిమాల్నే ఎక్కువగా ఇష్టపడి చేస్తుంటాడు. ఈ తరహా సినిమాలకు అడవిశేష్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. క్షణం, గూఢాచారి వంటి సినిమాల్ని తీసి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తాజగా అడవి శేష్ మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. గూఢాచారి 2ను త్వరలో తీసేందుకు అడవి శేష్ సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా కథను కూడా అతడే రెడీ చేసినట్లు సమాచారం. తన స్నేహితుల సలహాలు సూచనలతో స్క్రిప్ట్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. కథ కూడా బాగా కుదిరినట్లు టాక్. అడవి శేష్ నెక్ట్స్ ఫిల్మ్ కూడా యేనని సమాచారం. ఓ వైపు నటిస్తూ... మరో వైపు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రీప్ట్ విషయంలో కూడా తన సత్తా చాటుతున్నాడు అడవి శేష్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XUgXRU
No comments:
Post a Comment