Sunday, 19 April 2020

కొన్నిరోజులుగా నొప్పిగా ఉంది.. అందుకే హాస్పటల్‌ వెళ్ళలేదు: లావణ్య త్రిపాఠి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సినీ తారలందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది. సామజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సినీ నటులంతా హోమ్ క్వారంటైన్ లోనే ఉండిపోయారు. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో కరోనా ఎఫెక్ట్, తన హోమ్ క్వారంటైన్ గురించి స్పందిస్తూ ప్రముఖ మీడియాతో ముచ్చటించింది యంగ్ హీరోయిన్ . ఇంట్లోనే ఉంటున్నాను, క్షేమంగా ఉన్నానని చెబుతూనే తన చేతి వేళ్ళకు అయిన గాయం గురించి చెప్పుకొచ్చింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన చేతి వేళ్లకు గాయమైందని చెప్పింది లావణ్య. బలంగా, చాలా వేగంగా కిటికీ డోర్‌ వేయడంతో ఆ డోర్ మధ్యలోనే తన రెండు వేళ్లు పడి గట్టిగా దెబ్బ తగిలిందని ఆమె తెలిపింది. ఎనిమిది రోజులుగా నొప్పి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా హాస్పటల్‌కి కూడా వెళ్లలేదని చెప్పింది. ఇలాంటి సమయంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో? అయినా కరోనా సోకిన వారికి చికిత్స చేయడం ముఖ్యమని చెప్పుకొచ్చింది. సాధారణంగానే తనకు బయటకు వెళ్లే అలవాటు తక్కువ అని, ఇంట్లో ఉండడం, వంట చేయడం లాంటివే తనకు కాబట్టి ప్రస్తుతం అదే చేస్తున్నానని, కాకపోతే ఇంటికి హెల్పర్స్‌ రాకపోవడం వల్ల కొంచెం కష్టంగా ఉందని ఆమె చెప్పింది. ఇకపోతే దేశంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు ఊహించలేదని, ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదని ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పేర్కొంది. నాలాగే ప్రజలందరూ ఇళ్లల్లో సురక్షితంగా ఉంటున్నారని ఆశిస్తున్నానని చెప్పింది. ఇదిలాఉంటే ఈ కరోనా కల్లోల సమయంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తూ సీసీసీకి విరాళం అందించిన మొదటి హీరోయిన్‌గా లావణ్య తన గొప్పమనసు చాటుకుంది. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ఛారిటీకి లావణ్య 1 లక్ష రూపాయల చెక్ అందించింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34NJU3u

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....