Saturday, 6 March 2021

నువ్వు పక్కనుంటే ఆ ఫీలింగే వేరు.. ఉహించినదాన్ని మించి! ముద్దుల్లో మునిగితేలిన అల్లు అర్జున్- స్నేహా రెడ్డి

ఈ ప్రపంచంలో జీవిత చక్రం అనేది ఎవ్వరికైనా ఒకేలా ఉంటుంది. సాధారణ ప్రజలు మొదలుకొని సినీ, రాజకీయ సెలబ్రిటీల వరకూ ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు అనేవి కామన్. వాటన్నింటినీ అధిగమిస్తూ వెళితేనే జీవితం విజయవంతం అవుతుంది. ఇలాంటి మాటలు నిత్యం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. సరిగ్గా ఇవే పదాలు సతీమణి చెబుతూ బన్నీపై ప్రేమ కురిపించింది. ఈ మేరకు ఆమె పెట్టిన ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న (మార్చి 6) అల్లు అర్జున్- స్నేహా రెడ్డి తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పదేళ్లుగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. ఏ మాత్రం వీలు కుదిరినా భార్యాపిల్లలతో ఫ్యామిలీ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే స్నేహతో జీవితాన్ని పంచుకుంటూ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట బన్నీ. అంతేకాదు ఈ స్పెషల్ డే సందర్భంగా తన శ్రీమతిని ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సెలబ్రిటీ జోడీ తాజ్ మహల్ వద్ద తెగ సందడి చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ అందమైన పిక్స్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే బన్నీ తనను హత్తుకొని దిగిన ఓ పిక్ పోస్ట్ చేసిన స్నేహారెడ్డి.. ''నువ్వు పక్కనుంటే డల్ మూమెంట్ అనేదే కనిపించదు. మీరు ఉహించినదాన్ని మించి ప్రేమిస్తున్నా'' అని పేర్కొంది. ఇకపోతే బ్యాక్ గ్రౌండ్‌లో తాజ్ మహల్ ఉండగా ప్రేమగా ఒకరినొకరు కిస్ చేసుకున్నారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి. ఈ పిక్ బన్నీ ఫ్యాన్స్‌ని తెగ అట్రాక్ట్ చేస్తోంది. బన్నీ- స్నేహ పదేళ్ల ప్రేమకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3v1Cuq8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....