Sunday 28 March 2021

రాత్రి 3 గంటల వరకు అక్కడే.. అర్ధరాత్రి వేళ కమెడియన్‌తో శ్రీముఖి అలా..! షాకింగ్ సెల్ఫీ వీడియో

హీరోయిన్ల మాటేమో గానీ బుల్లితెర యాంకర్ల హంగామా మాత్రం మామూలుగా లేదండోయ్!. హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ హాట్ హాట్‌గా కనిపించడమే గాక భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల కంటే ఈ లేడీ యాంకర్లే సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు . ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత టీవీ తెరపై పాపులర్ అయిన యంగ్ అండ్ హాట్ శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ తెగ హంగామా చేస్తుంటుంది. ఓ వైపు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే మరోవైపు అల్లరి చేష్టలు చేస్తూ ఆకట్టుకోవడం అమ్మడి హాబీ. గత సీజన్ బిగ్ బాస్‌లో రచ్చరచ్చ చేసి రన్నరప్ కొట్టేసిన శ్రీముఖి.. ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ యమ జోష్‌‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది బుల్లితెర రాములమ్మ. ఈ వీడియోలో కమెడియన్ సద్దాంతో కలిసి ఊహించని విధంగా కనిపించింది శ్రీముఖి. ఓ బుల్లితెర కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. విరామం సమయంలో కమెడియన్ సద్దాంతో కలిసి ఈ షాకింగ్ వీడియో చేసింది. మొబైల్ యాప్ ఉపయోగించి ఈ ఇద్దరూ జంతువుల్లా భయంకరమైన లుక్‌లో కనిపించారు. అంతేకాదు 'షూటింగ్ జరుగుతోంది. రాత్రి 3 గంటల వరకు ఇక్కడే ఉన్నాం.. నిద్రొస్తోంది.. ఇక ఇంటికెళ్ళాలి' అని కామెంట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ ఆ టైమ్‌లో కూడా ఇలాంటి పనులేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. భార్యల వద్ద సుఖం దొరకక దాని కోసం అన్వేషించే అంకుల్స్ కథతో ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు నితిన్ 30వ సినిమాగా రాబోతున్న 'అందాదున్' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తోంది ఈ యంగ్ యాంకర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PxqGvv

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz