Friday, 26 March 2021

Varun Tej: రామ్ చరణ్ బర్త్ డే.. రాజమౌళి కంటే ముందుగానే వరుణ్ తేజ్ ట్రీట్.. మెగా లోకంలో సంబరాలు

ఓ స్టార్ హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు బర్త్ డే సీడీపీలు, ఆయన గ్రేట్‌నెస్ తెలిపేలా మోషన్ పోస్టర్స్ హల్చల్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. ఇక సదరు హీరో నటిస్తున్న సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వడం అయితే మరీ నాచురల్ అయింది. ఈ నేపథ్యంలోనే రేపు (మార్చి 27) మెగా పవర్ స్టార్ సందర్భంగా నేటి నుంచే సోషల్ మీడియా షేక్ అవుతోంది. చెర్రీ బర్త్ డే పురస్కరించుకొని రాజమౌళి కంటే ముందుగానే స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మెగా అభిమానుల కోసం రీసెంట్‌గా సాయిధరమ్‌ తేజ్‌ రిలీజ్‌ చేసిన కామన్‌ డీపీ పెద్దగా ఆకర్షించకపోగా దానిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ చేదు అనుభవాన్ని మరిపిస్తూ తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ మోషన్‌ పోస్టర్‌ బయటకు వదిలారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ షార్ట్ వీడియోలో.. గుర్రంపై స్వారీ చేస్తూ నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా రామ్ చరణ్ కనిపిస్తుండటం, నిప్పునే ప్రధానంగా ఎంచుకొని ఈ వీడియో రూపొందించడంతో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు చెర్రీ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ ప్రకటన చేశారు దర్శకధీరుడు రాజమౌళి. చెర్రీ బర్త్ డే కంటే ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ అని పేర్కొంటూ RRR నుంచి రామరాజుగా రామ్ చరణ్ కొత్త అవతారం చూపించబోతున్నామని తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఈ అప్డేట్ ఉంటుందని చెప్పారు. అయితే జక్కన్న కంటే ముందే వరుణ్ తేజ్ ఇలా స్పెషల్ ట్రీట్ ఇవ్వడం మెగా లోకంలో సంబరాలను రెట్టింపు చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31lnrdq

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...