Monday, 29 March 2021

BJP: నాకు ఓటు గుద్దండి.. రూ. లక్ష పట్టండి: హీరోయిన్ ఖుష్బూ ఎన్నికల హామీ మామూలుగా లేదు

తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఓట్లు గుద్దించుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీలతో ఊదరగొడుతున్నారు. తులం శరవణన్ ఇండిపెడెంట్ అభ్యర్థి.. తనను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఏడాదికి రూ.కోటి, ఓ మినీ హెలికాప్టర్, పెళ్లిళ్లుకు బంగారు నగలు, మూడంతస్తుల భవనం కట్టించి ఇస్తానని హామీలు కురిపించడంతో పాటు.. చంద్రమండలానికి తీసుకుపోతా అంటూ ఓటర్లను పిచ్చోళ్లని చేసే హామీలు ఇచ్చారు. అయితే తాజాగా సినీ నటి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. ఆడపిల్ల అకౌంట్‌లో రూ. లక్ష వేస్తానంటూ హామీ హామీ ఇచ్చారు ఖుష్బూ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఖుష్బూ తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లకు ఈ లక్ష రూపాయల ఆఫర్‌ని ప్రకటించారు. ఆర్ధికంగా మహిళలు మరింత బలంగా ఉండాలని, వారికి ఆర్థిక స్వాతంత్య్రం అవససరం అని అందుకే తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే ..వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయిలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు ఖుష్బూ. ఇక ప్రచారంలో భాగంగా దోసెలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఖుష్బూ. మొత్తానికి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ.. పదేళ్ల పొలిటికల్ జర్నీలో మూడు పార్టీలు మారిన నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఖుష్బూ సుందర్ .. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు 2010లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఖుష్ఫూ 2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ పార్టీ మార్చేసి.. 2020లో బీజేపీ తీర్థం పుచ్చుకుని పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. తమిళనాట బీజేపీకి సినీ గ్లామర్ అందించడం కోసం ఖుష్బూ కమలదళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తమిళనాట ఖుష్బూకి బీభత్సమైన క్రేజ్ ఉంది. ఒకానొక సందర్భంలో ఈ బొద్దుగుమ్మకి గుడిలు కూడా కట్టి పూజలు చేశారు తమిళతంబీలు. హీరోయిన్‌గా రాణించిన ఖుష్బూ కమలం అండతో పొలిటికల్ జర్నీని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rz2lml

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...