Tuesday, 30 March 2021

ఆ విషయంలో సురేఖా వాణి కూతురికి ఎదురుదెబ్బ.. ఏం పాపం చేశానంటూ సుప్రిత ఆవేదన

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు గురించి సోషల్ మీడియాలో తెలియని వారెవ్వరూ ఉండరు. తెరపై కనిపించే సురేఖా వాణి, సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఒక్కరేనా? అని ఆశ్చర్యపోవాల్సిందే. పార్టీలు, పబ్‌లు అంటూ వీకెండ్‌తో కూతురితో కలిసి సురేఖా వాణి హల్చల్ చేస్తుంటారు. అలా సురేఖా వాణి తన కూతురిని సోషల్ మీడియాలో ఓ స్టార్‌ను చేసేశారు. ఇక వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. వెండితెరపై కూతురు ఎంట్రీపై సురేఖా వాణి ఏనాడో క్లారిటీ ఇచ్చారు. తనకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదని, సుప్రిత ఇష్టపడితే సినిమాల్లోకి వస్తుందని, లేదంటే లేదని చెప్పేశారు. కానీ సురేఖా వాణి అడుగులు, సుప్రితను ఇలా ఫేమస్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడిచేయనున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆమె చేసే పోస్ట్‌లు, వేసే సెటైర్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. సోషల్ మీడియాలో సుప్రిత కనిపించే తీరు, వస్త్రాధారణపై నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు. ఇక సుప్రిత చేసే పోస్ట్‌లో ఎక్కువగా తప్పులు దొర్లుతుంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్‌లపై నెటిజన్లు కౌంటర్లు వేయగా.. దానికి ఘాటుగా స్పందించారు సుప్రిత. పనికొచ్చే పనులు చేయమని, ఇలా తప్పులు ఎంచడం కాదని సుప్రిత గట్టిగానే క్లాప్ పీకారు. మొన్నామధ్య సురేఖా వాణి రెండో పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రూమర్లు రాసిన మీడియా మీదా సుప్రిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్నవి రాయండి.. కొత్తవి క్రియేట్ చేయకండి.. అసలు మీకు మీరు జర్నలిస్ట్‌లు, ప్రైమ్ మీడియా అని ఎలా చెప్పుకుంటారు అని కౌంటర్లు వేశారు. తాజాగా సుప్రితకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల టపాటపా పడిపోతూ వచ్చారు. గడిచిన వారం రోజుల్లో సుప్రిత ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. వారం రోజుల్లో 321 మంది కొత్త ఫాలో అయితే.. ఉన్నవారిలో 422 మంది అన్ ఫాలో అయ్యారు. ఈ లెక్కన మొత్తంగా 101 మంది తగ్గిపోయారు. అయితే ఫాలోవర్ల కంటే అన్ ఫాలోవర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో సుప్రిత తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం సుప్రితకు 3.47లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సుప్రిత తన ఫాలోవర్ల విషయంలో తెగ బాధపడిపోతోన్నారు. ఇలా అన్‌ఫాలో ఎందుకు అవుతున్నారంటూ సుప్రిత తెగ ఆలోచించినట్టున్నారు. ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ అంటూ సుప్రిత ఆవేదన చెందింది. ఈ పోస్ట్ పెట్టడంలోనూ సుప్రిత స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు. చేశాను అని రాయబోయి.. చేయను అని రాసేశారు. మళ్లీ ఆ తప్పును వేరే పోస్ట్ ద్వారా సరి చేసేసుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wcgnOn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....