Saturday, 27 March 2021

క్షమించడం.. అందరి క్షేమం కోసం క్యాన్సిల్ చేయక తప్పలేదు: సింగర్ సునీత పోస్ట్

వివాహం తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు సింగర్ . తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు సింగర్‌‌గా ప్రొఫెషనల్ అప్డేట్స్‌ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీతతో పాటు గీతామాధురి, రమ్య, సాహితి, రేవంత్, అనురాగ్ కులకర్ణి, శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది సింగర్ సునీత. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు సింగర్ సునీత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pag6dW

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...