Monday, 29 March 2021

మొత్తానికి పార్ట్నర్ దొరికేసింది.. రొమాన్స్‌లో ముగిని తేలిన సోహెల్

బిగ్ బాస్ ఫేమ్ ప్రస్తుతం తన సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్‌తో బిజీగా ఉంటున్నానని, వర్కవుట్లు చేయడానికి కూడా టైం ఉండటం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. సెట్‌లోనే డంబెల్స్‌తో వర్కవుట్లు చేస్తున్నానని సోహెల్ అన్నారు. ఈ మధ్యే అరియానాను కూడా తన సెట్‌కు ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి సెట్‌లో బాగానే రచ్చ చేశారు. అయితే సోహెల్ సినిమా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత మాస్‌గా ఉందని, ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సోహెల్‌కు జంటగా నటించేది ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ కొత్త మూవీలో సోహెల్ పక్కన పార్ట్నర్‌గా ఎవరు నటించనున్నారా? అని అందరూ అనుకుంటుండగా అసలు విషయం చెప్పేశారు. హోలీ సందర్బంగా తన సినిమాలోని హీరోయిన్ గురించి సోహెల్ అందరికీ చెప్పేశారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తన సినిమాలో నటిస్తోందని సోహెల్ తెలిపారు. ఎంతగానో ఎదురుచూస్తోన్న అసలు సిసలు అప్డేట్ ఈ హోళీ నాడు వచ్చేసింది. ఇప్పటికీ ఆ ఎదురుచూపులు అయిపోయాయ్.. మా సినిమాలో హీరోయిన్ రూపా కడవయూర్‌ను అందరికీ పరిచయం చేస్తున్నాను. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన రూపా.. నటన మీదున్న ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తన సత్తా చాటారు. ఈమె రాకతో మా టీం ఇంకా బలంగా తయారైంది. నిర్మాత, దర్శకుడు, కెమెరామెన్ ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతమైన వారే. రూపను అందరూ ఆహ్వానించండని తన అభిమానులను సోహెల్ కోరారు. సినిమా పరంగానే కాదు ఇకపై మనకు ఫ్యామిలీ డాక్టర్ కూడా దొరికేసింది అంటూ సెటైర్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3w6ovQr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....