Saturday, 27 March 2021

మా నాన్న చావుకి కారణం వాళ్లే.. దారుణమైన మోసం.. గతిలేక ఆరోజుల్లో నేను: కమెడియన్ శ్రీలక్ష్మి పెయిన్‌ఫుల్ స్టోరీ

కమెడియన్లు ఎంత మంది వచ్చినా బ్రహ్మానందం అంటే కామెడీలో ఆయన మహోన్నత శిఖరం. కమెడియన్ కావాలనుకునేవాళ్లకి బ్రహ్మానందం ఎలాగైతే రోల్ మోడల్‌గా ఉంటారో.. లేడీ కమెడియన్ల విషయానికి వస్తే అలా. ఆమె ఇప్పుడంటే అవకాశాలు లేక తెరమరుగయ్యారు కానీ.. అప్పట్లో ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేది ఆమె నవ్వుల విందు చూసి.. కేవలం కమెడియన్‌గానే కాదు.. హీరోయిన్‌గానూ చేసింది శ్రీలక్ష్మి. తమిళ్‌లో నాలుగు.. మలయాళంలో రెండు.., కన్నడ (ఆనందభైరవి రీమేక్)లో హీరోయిన్‌గా నటించారు. ఇక తెలుగులో అయితే హీరోయిన్‌గా అవకాశం లభించలేదు కానీ.. సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఇన్ని భాషల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమెకు లక్ కలిసిరాకపోవడంతో ఎక్కడా కూడా రాణిచలేకపోయింది. ఆడియన్స్ కూడా సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే.. ఏదొస్తే అది అన్నట్టుగా.. చిన్న చిన్న పాత్రలు చేసింది శ్రీలక్ష్మి. విశ్వనాథ్ గారి స్వర్ణకమలం ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయినా కూడా హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అయ్యింది. ఆ టైంలోనే వంశవృక్షం సినిమా హీరోయిన్ ఛాన్స్ కూడా మిస్ కావడంతో.. ఇక మనకి హీరోయిన్ అయ్యే యోగం లేదనుకుని ‘నివురుగప్పిన నిప్పు’ చిత్రంలో కామెడీ రోల్ చేసింది. ఆ సినిమా కూడా పెద్దగా క్లిక్ కాలేదు. అయితే జంధ్యాల గారి ‘రెండు జడల సీత’ సినిమాతో శ్రీలక్ష్మి సుడి తిరిగింది. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టింది. అదృష్ట దేవత వరించడంతో కామెడీ రోల్స్‌కి కొదువ లేకుండా పోయింది. శ్రీలక్ష్మి కోసం దర్శకులు ఓ వెర్షన్ రాసుకుని ఉంచుకునేవారు. నాన్ స్టాప్‌గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది శ్రీలక్ష్మి. అయితే శ్రీలక్ష్మి సినిమా ఫీల్డ్‌లోకి రావడానికి కారణం తన నాన్నగారే అని చెప్తుంది. తన తండ్రిని కొంతమంది దారుణంగా మోసం చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లోకి రావాల్సి వచ్చింది ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘నాన్నగారు అమరజ్యోతి’ అనే సినిమా తీశారు. యాక్టింగ్ మానేసి మరీ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఆ సినిమా తీస్తుండగా.. విజయనిర్మల, సత్యనారాయణ, ఛాయా దేవి, అల్లూరి రామలింగయ్య, గీతాంజలి పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లను పెట్టి ఆ సినిమా తీశారు. 8 రీల్లు వరకూ సినిమా పూర్తి చేశారు.. ఈలోపు సినిమా కొనుక్కోవడానికి బయ్యర్స్ వచ్చారు. కానీ నాన్న గారి ఫ్రెండ్స్ కొంతమంది.. ఆయనకి ఫైనాన్స్ అవసరం లేదంట.. ఓన్‌గానే సినిమా తీస్తున్నారు అని బయ్యర్స్‌ని వెనక్కి పంపిచేశారు. ఆ విషయం మానాన్నగారికి తెలియదు. తీరా బయ్యర్స్, డిస్ట్రిబ్యూషన్ కోసం నాన్న మార్కెట్‌లోకి వెళ్లినప్పుడు.. ఆరోజు మేం డబ్బులు పట్టుకుని వస్తే అవసరం లేదన్నారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారేంటి? అని అడిగారు. అప్పుడు నాన్న గారి చుట్టూ ఉన్న వాళ్లు మోసం చేశారు. నాన్న గారు సంపాదించిన దాంట్లో చాలా వరకూ ఆ సినిమాకి పెట్టేశారు. పైగా మొదట్లో సొంతంగా చేస్తున్నారని చెప్పి.. మధ్యలోకి వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరకు వెళ్లేసరికి వాళ్లకి నమ్మకం కలగకుండా పోయింది. సినిమాని తీసుకోలేదు. దీంతో నాన్నగారు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అదే సందర్భంలో పచ్చకామెర్లు వచ్చాయి. మా నాన్న అమర్‌నాథ్ అంటే ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆ పేరుని ఉపయోగించుకుని నన్ను సినిమాల్లోకి తీసుకువెళ్లమని చాలామంది చెప్పడంతో నాన్న గారు కస్సుమని లేచారు. నేను చేతకాని వాడ్ని అనే కదా.. కూతుర్ని సినిమాల్లోకి పంపమంటున్నారు.. అని అంతెత్తున లేచారు. మా కెరియర్ గురించి బెంగపెట్టుకుని.. ఇద్దరు కూతుళ్లు పెళ్లి చేయాలి ఎలా అని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ సందర్భంలో ఆయనకు ఇష్టం లేకుండానే నేను సినిమాల్లో ట్రై చేశా. ఆయన పోయిన తరువాత నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1980లో ఫిబ్రవరిలో నాన్నగారు చనిపోయారు.. ఆ వెంటనే మార్చిలో నేను ఇండస్ట్రీలోకి వచ్చేశా. దీంతో చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకునేవారు. అమ్మాయిని సినిమాల్లోకి పంపేశారు ఏంటి? ఆమె భవిష్యత్ ఏమి కావాలి? అనే గుసగుసలాడేవారు. మా దారి మేం చూసుకోవాలి.. కదా.. బాధ్యత తీసుకునే వాళ్లు లేరు కదా అని అమ్మ వాళ్ల నోళ్లు మూయించింది’ అంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది సీనియర్ నటి శ్రీలక్ష్మి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ssvfWz

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...