Wednesday, 31 March 2021

న్యూడ్ ఫొటో కోసం ప్రియమణికి రిక్వెస్ట్.. అలా చేస్తే తప్పకుండా ఇస్తానంటూ అమ్మడి షాకింగ్ రియాక్షన్!

రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ సెలబ్రిటీలు- సామాన్య మనుషుల మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలకు నేరుగా మెసేజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుండటం సెలబ్రిటీలకు సమస్యగా మారుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఈ అమ్మడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అందం, అందుకు తగ్గ అభినయం రెండూ కలగలిపి ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరుగా మంచి గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్‌గా సత్తా చాటిన ప్రియమణి.. జగపతిబాబు, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలందుకుంది. బికినీలో కిక్కివ్వాలన్నా, హోమ్లీ లుక్‌లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించాలన్నా బెటర్ ఛాయిస్ ప్రియమణి మాత్రమే అన్నట్లుగా హవా నడిపించిన ఆమె పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది. ఆ తర్వాత రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియమణి.. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేటితరం హీరోయిన్స్ లాగే ప్రియమణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తోంది. ఇటీవల మోడ్రన్ బ్లాక్ డ్రెస్ ధరించి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె.. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ఇవి చూసిన ఓ నెటిజన్ అభ్యంతరకర కామెంట్ చేశాడు. ఏకంగా మీ న్యూడ్ పిక్ పోస్ట్ చేయండి అని నేరుగా అడిగేశాడు సదరు నెటిజన్. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన ప్రియమణి చాకచక్యంగా వ్యవహరిస్తూ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'మీ తల్లిని అలాగే మీ సోదరిని అలాంటి ఫొటోలు అడిగి పోస్ట్ చేయండి. అప్పుడు నేను కూడా పోస్ట్ చేస్తాను' అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. దీంతో వెంటనే సదరు నెటిజన్ క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఈ విషయంలో ప్రియమణి చాకచక్యాన్ని మెచ్చుకుంటున్నారంతా. ప్రస్తుతం తెలుగులో ''నారప్ప, విరాటపర్వం'' సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cK0d7j

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....