Monday, 29 March 2021

Rang De 3 Days Collections: థియేటర్స్‌తో కొనసాగుతున్న నితిన్- కీర్తి సురేష్ హవా

యంగ్ హీరో లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ మార్చి 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే గాక, విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. దీంతో వసూళ్ల హవా నడిపిస్తూ ఈ సినిమా ముందుకెళ్తోంది. మూడో రోజు సెలవుదినం ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రోజు 2.88 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారీగా కలెక్షన్ వివరాలు చూస్తే.. నైజాం- 1.24 కోట్లు సీడెడ్‌- 52 లక్షలు ఉత్తరాంధ్ర- 40 లక్షలు ఈస్ట్‌ గోదావరి- 17 లక్షలు వెస్ట్‌ గోదావరి- 13 లక్షలు గుంటూరు- 16 లక్షలు కృష్ణా- 16.50 లక్షలు నెల్లూరు- 10 లక్షలు ప్రపంచవ్యాప్తంగా 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగ్ దే మూవీ ఈ మూడు రోజుల్లో కలిపి 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వచ్చే వారం కూడా ఇదే రన్ కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఈజీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నితిన్, జంటగా నటించారు. ఇద్దరి నటనపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rB2ZQe

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....