Sunday 28 March 2021

అను ఇమ్మానుయేల్ బర్త్ డే.. 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్

నేడు (మార్చి 28) బ్యూటిఫుల్ హీరోయిన్ . ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఆమెకు యూనిట్ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. లైట్ హౌస్ ఆఫ్ అంటూ అను అందాన్ని వర్ణించారు. ఈ పోస్టర్‌లో క్యూట్ పోజిచ్చి చూపులతోనే మత్తెక్కిస్తోంది అను ఇమ్మానుయేల్. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. చిత్రంలో యంగ్ హీరో హీరోగా నటిస్తుండగా ఆయన సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. అదితి రావ్‌ హైదరీ మరో హీరోయిన్. RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ చిత్రంపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3svUZkU

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz