Sunday, 28 March 2021

అలాంటి మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. సురేఖా వాణి షాకింగ్ పోస్ట్

నటి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తన నటనతో అందరినీ మెప్పించారు. కామెడీ పాత్రలైనా, ఎమోషనల్ క్యారెక్టర్లైనా ఏదైనా సరే ఆమె తనదైన శైలిలో స్క్రీన్ మీద మెప్పించగలరు. అయితే సురేఖా వాణిని తెరపై చూసి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడికి ఇక్కడికి ఎంతో పూర్తి భిన్నంగా ఉంటారు. సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ లేడీగా కనిపిస్తుంటారు. ఇక ఆమె తన కూతురు సుప్రితతో కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. కూతురిని కూడా తెరపైకి తీసుకురావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌లోనూ నటించారు. ఇక త్వరలోనే సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. తన తల్లిపై, తనపై వచ్చే వార్తలు, గాసిప్స్‌పై సుప్రిత ఫైర్ అవుతుంటారు. మీడియాపై సుప్రిత వేసే సెటైర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మధ్య సురేఖా వాణి రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై సుప్రిత ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఉన్నవి మాత్రమే రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. అలా ప్రతీ సందర్భంలోనూ సుప్రిత కాస్త ఘాటుగానే స్పందిస్తుంటారు. ఇక సురేఖా వాణి సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తమపై వచ్చే వార్తలు, గాసిప్స్, రూమర్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయితే తాజాగా సురేఖా వాణి ఓ పోస్ట్ చేశారు. అందులోని అంతరార్ధం, అది ఎవరిని ఉద్దేశించి చేశారో కచ్చితంగా తెలియడం లేదు. కానీ సురేఖా వాణికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుందని సురేఖా వాణి చెప్పుకొచ్చారు. కానీ ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cqMO3I

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...