Saturday, 27 March 2021

థ్రిల్లర్ జానర్‌‌లో కొత్త తరహా మూవీ MMOF.. డిఫరెంట్ స్టోరీతో జేడీ చక్రవర్తి హంగామా

ఒకానొక సమయంలో హీరోగా పలు సినిమాలతో ఆకట్టుకొని కాస్త గ్యాప్ ఇచ్చిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ సారి ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కిన మూవీతో పలకరించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైందని, మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుపుతూ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జెకే క్రియేషన్స్ పతాకాలపై శ్రీమతి అనుశ్రీ సమర్పణలో రాజశేఖర్, ఖాసీంలు ఈ MMOF చిత్రాన్ని నిర్మించారు. ఎన్.ఎస్ సి దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి కథానాయకుడగా నటించిన ఈ సినిమాలో థియేటర్ నడుపుకునే ఓ వ్యక్తి ఆ థియేటర్లో అడల్ట్ సినిమాలు నడుపుకుంటూ ఉంటాడు. అయితే థియేటర్‌కి వచ్చిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళు చనిపోవడానికి, థియేటర్‌కి, ఆ అడల్ట్ సినిమాలకి ఉన్న సంభందం ఏంటి? అనే డిఫరెంట్ కథను ఈ మూవీలో చూపించారట. ఈ సినిమా పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమా అమెజాన్‌లో విడుదల అయిందని.. ప్రేక్షకులు కోరుకునే అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తప్పకుండా ఈ సినిమాని చూడండి అని అన్నారు. థ్రిల్లర్ జానర్‌‌లో ఇదో కొత్త తరహా చిత్రం అని తెలిపారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి, బెనర్జీ, కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర, అక్షిత ముద్గల్, అక్షత శ్రీనివాస్, టార్జాన్, మనోజ్ నందన్, శ్రీ రామచంద్ర, రాజీవ్ తదితరులు నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u1yQLM

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...