Monday, 29 March 2021

రంగురంగుల హోలీ.. భర్తతో కాజల్ చిల్!! పద్దతిగా కానిచ్చేసిన కొత్త పెళ్లి కూతురు

పండగ వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా సంబరంగా రంగులతో ఎంజాయ్ చేస్తుంటారు. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో హోలీ సంబరాలు మిన్నంటుతాయి. స్నేహితులు, బాగా కావాల్సిన వాళ్లకు రంగులు పూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకగా వేడుకగా అంతా కలుసుకొని రంగురంగుల హోలీ జరుపుకుంటారు. కాగా, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్న కాజల్.. తన భర్తతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రంగులు పూసుకున్న చందమామ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత సినిమా జోష్ మరింత పెంచింది కాజల్. పెళ్లికి ముందు కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు-2' సినిమాలో నటిస్తున్న ఆమె.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. దీంతోపాటు హిందీలో 'ముంబై సాగా' సినిమా చేస్తోంది. మంచు విష్ణుతో కలిసి చేసిన 'మోసగాళ్లు' మూవీ ఇటీవలే విడుదలైంది. మొత్తానికి సినిమాల జోష్ కంటిన్యూ చేస్తూనే భర్తతో ఇలా వీలు చిక్కినప్పుడల్లా చిల్ అవుతున్న కాజల్‌ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3m1Yvky

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....