Saturday 27 March 2021

Laahe Laahe Song: బర్త్ డే చిన్నోడిది.. సందడి మొత్తం పెద్దోడిది.. ఆ గ్రేసు ఏంది ‘ఆచార్యా’.. మళ్లీ వీణ స్టెప్ లాహె లాహె

ఈ పోస్టర్ చూశారుగా.. మెగాస్టార్ స్టైలిష్ స్టెప్‌కి ఎవరైనా విజిల్ కొట్టాల్సిందే అనేట్టుగా ఉంది. 60 ప్లస్‌లో గ్రేసు బహు చూడసక్కగా ఉంది బాసూ అనేట్టుగానే ఉంది. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ హడావిడి మామూలుగా లేదండోయ్. చిన్నోడు బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే ఈ పెద్దోడు దంచికొడుతున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి- రామ్ చరణ్ కలిసి తొలిసారి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. చేతిలో తుపాకులు పట్టుకుని ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ ఆచార్యతో సిద్ధ సర్ ప్రైజ్ చేశాడు. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన చిరు, చరణ్‌లు ఆ పోస్టర్‌లో మాత్రం అన్నాతమ్ముడిగానే కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టరే ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనుకుంటే.. అసలు సిసలు విందుభోజనంలా ఆచార్య నుంచి మరో పోస్టర్ వచ్చింది. మార్చి 31న ఆచార్య నుంచి ‘లాహే.. లాహే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ దరువు వేస్తున్న ఈ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్‌ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. చిరంజీవి బ్లాక్ షర్ట్‌లో వీణ స్టెప్ వేస్తున్నట్టుగా మంచి గ్రేసులో కనిపించి.. స్టెప్పు వేస్తే నేనే వెయ్యాలెహే అనేట్టుగా హరిదాసులతో కలసి అదరగొట్టేశారు చిరు. మొత్తానికి ఈ మెగాస్టెప్పు పోస్టర్ ఫ్యాన్స్ పూనకం రప్పించేట్టుగా ఉంటే.. ఎప్పుడొప్పుడు ‘ఆచార్యా’? అనేట్టుగా ఆసక్తిపెంచేశారు మెగాస్టార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3feo94e

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz