Monday, 29 March 2021

'లైఫ్‌లో మజా కోసం' బిగ్‌బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్.. కాలేజీ ముచ్చట్లు చెబుతూ క్రేజీ వీడియో

స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా అద్బుతమైన విజయాల్లో భాగమైన క్రికెట్ కింగ్ వెండితెరపై సందడి చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి "" సినిమా చేస్తున్నారు. వారిద్దరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు 'సింగ్ అండ్ కింగ్' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ పెట్టారు. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్, మాజీ 'మిస్ శ్రీలంక' హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్ కె) విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో విడుదల చేసి ఆసక్తిరేకెత్తించారు. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా 'లైఫ్‌లో మజా కోసం' అనే పాట రిలీజ్ చేశారు. కాలేజీ ముచ్చట్లతో శరత్ సంతోష్ పాడిన ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి శాంతకుమార్ సినిమాటోగ్రఫీ చేపట్టగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sz5UdE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....