Wednesday, 31 March 2021

Acharya: ట్రెండ్ అవుతున్న చిరంజీవి స్టెప్స్.. స్పెషల్ కిక్కిస్తున్న ఇద్దరు అందాల భామలు

ఎన్ని తరాలు మారినా, ఎందరు కొత్త హీరోలు చిందులేసినా టాలీవుడ్‌లో చిరంజీవి స్టెప్పులకున్న డిమాండే వేరు. అప్పట్లో బ్రేకు డాన్సులతో తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. రీ- ఎంట్రీ తర్వాత కూడా మెగాస్టార్ వేస్తున్న స్టెప్పులకు ఫిదా అవుతోంది ప్రేక్షకలోకం. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'లాహే.. లాహే' రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెగా స్టెప్పులు చూస్తే.. థియేటర్స్ మాటేమో గానీ ఇంట్లోనే ఈలలు వేసే పరిస్థితి. మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ నిన్న (బుధవారం) సాయంత్రం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వదిలిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా చిరంజీవి వేసిన స్టెప్స్ జనాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ సాంగ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారి యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదపడం, మధ్య మధ్యలో మెగా స్టెప్పులు గోల పెట్టిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, మణిశర్మ బాణీలు పాటకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'ఆచార్య' సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై డైరెక్టర్ కొరటాల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తూనే నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 14వ‌ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cFt6kJ

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...