Saturday 27 March 2021

16 రోజుల పాటు హవా నడిపించిన 'జాతిరత్నాలు'.. ఇక స్లో అయినట్లేనా..? ఇదీ టోటల్ రిపోర్ట్

కరోనా విలయతాండవంతో విలవిల్లాడిన థియేటర్ల దుమ్ముదులిపారు 'జాతిరత్నాలు'. ఈ గల్లీ పోరగాళ్ల హవాతో థియేటర్లలో పూర్వవైభవం కనిపించడమే గాక వసూళ్ల ప్రవాహం కనిపించింది. తొలి షోతోనే మొదలైన సక్సెస్ టాక్ నిర్మాతలకు లాభాల పంట పండించింది. నిన్నటితో 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పుడిప్పుడే స్లో అవుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఈ 16 రోజుల్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు 25 కోట్ల మేర లాభాలు గడించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన ఈ సినిమా 15 రోజులకు గాను 36.45 కోట్లు వసూలు చేసి ఏకంగా 25 కోట్లకు పైగా లాభాలను అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 31.13 కోట్ల షేర్ వసూలు చేసిన ‘జాతిరత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 1.55 కోట్లు, ఓవర్సీస్‌లో 3.96 కోట్లు రాబట్టింది. దీంతో విడుదలైన 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.64 కోట్లు షేర్‌తో పాటు 60.35 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వరుసగా బెస్ట్ కలెక్షన్ రిపోర్ట్స్ సంపాదించిన జాతిరత్నాలు ఇప్పుడు కాస్త నెమ్మదించారు. 16వ రోజు 14 లక్షల రూపాయల కల్లెక్షన్స్‌తో సరిపెట్టుకున్నారు. దీంతో ఇక హవా ఆగినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద హిట్ సాధించినందుకు నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం సినీ వర్గాల్లో సైతం ఆనందం నింపింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. చిత్రాన్ని తనదైన స్టైల్‌లో మలిచిన అనుదీప్ కేవీ దర్శకత్వ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇంకా మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నారు ఆడియన్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39mOcT8

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc