Monday, 29 March 2021

మళ్లీ అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్.. దానికి ఫైన్ కట్టి నెట్టింట్లో నవ్వులపాలు.. దారుణమైన ట్రోలింగ్స్

మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం అంటూ సవాల్ చేసి అప్పట్లో పొలిటికల్ జోకర్‌గా మిగిలిపోయారు . ఆ తరువాత ఈ పాలిటిక్స్‌కి ఆ 7’O Clock బ్లేడ్‌‌కి ఓ దండం రా నాయనా.. బుద్దొచ్చింది.. ఇక రాజకీయాల్లోకి చచ్చినాపోను.. నా సినిమాలు నేను చేసుకుంటా అంటూ బండ్ల గణేష్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే అప్పుడంటే సినిమాలు, ఈవెంట్లూ అవీ ఇవీ ఉండేవి కాబట్టి బండ్ల గణేష్ ఏదో ఒక స్టేజ్‌పై కామెడీ చేసేశారు. ప్రస్తుతానికైతే సినిమాలేం లేవు కాబట్టి.. ట్విట్టర్ ద్వారానే అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తరచూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో జోరుగా దూసుకుపోతుంటారు. ఒక్కోసారి ఆ స్పీడ్‌లో యాక్సిడెంట్‌లు కూడా అవుతుంటాయి. ఆయన మీదే ట్రోలింగ్ రూపంలో దాడి జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలీక కొన్ని సార్లు.. భాష రాక ఇంకొన్ని సార్లు తెగ ఇబ్బందులు పడుతుంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను బండ్ల గణేష్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక.. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ను తిట్టిన, వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్‌ను లైక్ చేసేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్నను ఆడుకున్నారు. తప్పు తెలుసుకున్న బండ్ల గణేష్ త్వరగానే సరిదిద్దుకున్నాడు. ట్విట్టర్ ఎలా వాడాలో తెలియక జరిగిన తప్పు అని వివరణ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు. ఇక బండ్ల గణేష్ పెట్టే ట్వీట్లు అందరినీ నవ్విస్తుంటాయి. ఆయన ఎక్కువగా చదువుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ కూడా రాదని తెలిసిందే. కానీ బండ్ల గణేష్ మాత్రం తన ఇంగ్లీష్ నాలెడ్జ్‌ను పదే పదే అందరికీ చూపిస్తుంటారు. స్పెల్లింగ్స్ తప్పుగా రాయడంతో అందరూ బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంటారు. తాజాగా బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేసి ట్రోలర్స్‌కి దొరికేశారు. ఒకసారి కాదు.. ఒకే తప్పుకు రెండు సార్లు దొరికారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కులు లేని యెడల ఫైన్ వేస్తూ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. అలానే బండ్ల గణేష్‌ మాస్క్ ధరించనందు వల్ల రెండు వేల రూపాయలు ఫైన్ పడింది. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ చూపుతూ ఆధారాలు కూడా చూపించాడు. మాస్క్ లేనందున రూ. 2వేల జరిమానా కట్టాలని అందులో ఉంది. అయితే ప్రజలకు జాగ్రత్త చెబుతూ మాస్క్ ధరించండని బండ్ల గణేష్ ట్వీట్‌లోని ఉద్దేశం. ఆయనఉద్దేశ్యం కరెక్ట్ అయినా చెప్పిన మాట, రాసిన పదాలు మాత్రం తప్పు. మాస్క్ ధరించండి (Wear mask) అని చెప్పాల్సింది పోయి.. where mask అని మొదటగా ట్వీట్ పెట్టాడు. అది తప్పు అని తెలుసుకుని డిలీట్ చేశాడు. మరో ట్వీట్ వేసిన బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేశాడు. ఈ సారి Waer mask అంటూ అడ్డంగా దొరికాడు. ఈ పాట్లు దేనికి బండ్లన్న.. ఏ స్కూల్‌లో చదివావ్ అన్నా.. నీ వల్ల మాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా పోతోంది.. స్పెల్లింగ్స్ కూడా మరిచిపోతోన్నా అని రకరకాలుగా బండ్ల గణేష్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PjQH1s

No comments:

Post a Comment

Junaid Khan On Aamir, Khushi And More...

'He has always let us do our own thing but if we ever need anything, he is there with the best advice.' from rediff Top Interviews...