Saturday, 6 March 2021

దుశ్యంత్.. అతనే నా అందాల రాకుమారుడు.. వైరల్ అవుతున్న సమంత సోషల్ మీడియా పోస్ట్

అక్కినేని కోడలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమా అప్‌డేట్స్ పోస్ట్ చేయడమే గాక వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా 'అతనే నా అందాల రాకుమారుడు' అంటూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో వదిలింది. ఇంకేముంది సామ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వెంటనే వైరల్ అయింది. మరి ఆ అందాల రాకుమారుడు ఎవరు? ఇది నిజ జీవితానికి సంబంధించిందా లేక సినిమాకు సంబంధించిన విషయమా అనే దానిపై ఓ లుక్కేద్దామా. పెళ్లి తర్వాత సినిమాల పరంగా జోష్ పెంచిన సమంత.. మరికొద్ది రోజుల్లో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న '' సెట్స్ మీదకు వెళ్లనుంది. మహాభారతం.. ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తూ శాకుంతలగా సమంత నటించనుందని పేర్కొన్నారు గుణశేఖర్. దీంతో మరి దుశ్యంతుడి క్యారెక్టర్ ఎవరిని వరిస్తుందనే దానిపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో తాజాగా తన అందాల రాకుమారుడు.. దుశ్యంత్ అంటూ 'శాకుంతలం' మూవీలో దుశ్యంతుడి పాత్ర ఎవరు చేస్తున్నారో రివీల్ చేసింది సామ్. ప్రముఖ మలయాళ నటుడు దుశ్యంతుడిగా నటించబోతున్నాడని పేర్కొంటూ ఓ షార్ట్ వీడియో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయి 'శాకుంతలం' సినిమాలో సామ్ పక్కన నటించే నటుడి విషయమై జనాల్లో ఓ క్లారిటీ వచ్చేసింది. గుణశేఖర్ తెరకెక్కించనున్న ఈ భారీ మూవీతో తన కెరీర్‌లో మొదటిసారి పౌరాణిక పాత్ర పోషించబోతోంది సమంత. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యమిస్తూ అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ceIOSK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....