Saturday, 6 March 2021

నెంబర్ వన్ విజయ్ దేవరకొండ.. మరో రికార్డు సొంతం చేసుకున్న రౌడీ స్టార్

టాలీవుడ్ రౌడీ స్టార్ జోరు మామూలుగా లేదండోయ్. ఓ వైపు సినిమాలు, మరోవైపు బిజినెస్, ఇంకోవైపు సోషల్ మీడియా హవా.. ఇలా అన్ని కోణాల్లో సత్తా చాటుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఇతర హీరోలతో పోల్చితే చేసింది కొన్ని సినిమాలే అయినా మనోడి ఫాలోయింగ్ మాత్రం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ విజయ్ అంటే తెగ ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఖాతాలో ఓ రికార్డు క్రియేట్ చేసి నెంబర్ వన్ అనిపించుకున్నారు విజయ్. రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటూ పోతున్న విజయ్ దేవరకొండ.. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా విజయ్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్ల క్రాస్ చేయడం విశేషం. గతేడాది ఆయన ఫాలోవర్స్ 7 మిలియన్లు మాత్రమే. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆ సంఖ్య అమాంతం ఇలా పెరిగిందంటే జనాల్లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా.. విజయ్ దేవరకొండ డేట్స్ కోసం మాత్రం అగ్ర దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ చేస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా ఉండేలా సర్వ హంగులతో రూపొందిస్తున్నారు పూరి. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉండనుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ccrDRo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....