ఎమోషనల్ ప్రేమకథను సెన్సిబుల్‌గా ప్రెజెంట్ చేసి దర్శకుడిగా తొలి చిత్రంతోనే సత్తా చూపించారు బుచ్చిబాబు. సుకుమార్ దగ్గర లెక్కలు నేర్చుకుని ఆ తరువాత ఆయన బాటలోనే సినిమాల్లోకి వచ్చి.. సుక్కూ ప్రియ శిష్యుడిగా మారిన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ చిత్రం శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి అనే కొత్త నటీనటుల్ని ఎంపిక చేసుకుని ‘ఉప్పెన’ చిత్రంతో పెద్ద ప్రయోగమే చేశాడు ఈ దర్శకుడు. చూడ్డానికి సన్నగా.. గోదారి యాసలో మన పక్కింటి కుర్రాడిలా అనిపించే బుచ్చిబాబుపైనే ఇప్పుడు టాలీవుడ్ డిస్కషన్స్. ఇలాంటి కంటెంట్‌ని ఎలా డీల్ చేయగలిగాడు.. ఇంతటి రిస్క్ ఎందుకు చేశాడు.. అసలు కొత్త దర్శకుడు అనే ఫీల్ కలిగకుండా అనుభవం ఉన్న దర్శకుడిలా భలే చేశాడంటూ బుచ్చిబాబుపై చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు బుచ్చిబాబు. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో సాధించేయాలని అని అనుకోలేదు. ఎందుకంటే మా ఊర్లో నేను నాకు ఉన్న డబ్బుతో హ్యాపీగా బతికేయొచ్చు. ఇంట్లో కూర్చుని తిన్నా హ్యాపీగా బతికేస్తా.. అన్ని డబ్బులు ఉన్నాయి.. మాకు డబ్బులు, ఆస్తులు ఎక్కువే ఉన్నాయి. కానీ ఏదో సినిమా తీద్దాం అని ఇండస్ట్రీకి వచ్చాను. మా అమ్మగారు ఒకటే అడిగారు.. రేయ్ బుచ్చిబాబూ నువ్ డైరెక్టర్ అయ్యావనే మాట నా చెవిన పడెయ్ రా.. ఒక్క సినిమా తీసి వచ్చెయ్ అని ఇప్పటికీ మా అమ్మ చెప్తూనే ఉంటుంది. సినిమా అయిపోయింది కదా.. వచ్చెయ్ అని అంటున్నారు. అది కాదులే అమ్మా.. ఇంకో సినిమా అంటే .. ఒక సినిమా అనే కదరా వెళ్లావ్.. ఎందుకు అక్కడ వచ్చెయ్ అంటున్నారు. నేను ఇక్కడో సాధించేయాలని అనుకోవడం లేదు. డబ్బుల కోసం సినిమా కష్టాలేం పడలేదు. అన్నింటిలోనూ కష్టం ఉంటుంది కానీ.. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. నేను సినిమాల్లోకి రావడానికి మా గురువు సుకుమార్ సార్. ఆయన దగ్గర నేను ‘ఆర్య 2’, 100% లవ్, వన్ నేనొక్కడినే, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు పనిచేశా. మా గురువుగారి గైడెన్స్‌లో ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యా’ అంటూ చెప్పుకొచ్చారు బుచ్చిబాబు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37csPmp
No comments:
Post a Comment