
సెలవంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి. స్కూల్‌కి పోయే బుడతడి నుంచి ఆఫీసుకు పోయే మేనేజర్ దాకా సెలవు దినం కోసం ఎదురుచూస్తుంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రతి ఏడాది క్యాలెండర్ ఇయర్‌లో వచ్చే సెలవులను ముందే నోట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజున సినిమాలు చూస్తూ, ఫ్యామిలీతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున సెలవు లేకుంటే ఎలా? అని భావించిన ఫ్యాన్స్.. ఆ రోజు సెలవు కావాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేజీఎఫ్ చాప్టర్-1 ఊహించని సక్సెస్ సాధించింది. యష్ నటన, ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు యావత్ సినీ లోకం ఫిదా అయింది. భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రికార్డులను తిరగరాయడంతో దీనికి సీక్వల్‌గా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ చేస్తూ ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు. జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ కానుందని తెలపడంతో యష్ ఫ్యాన్స్ ఆ డేట్‌పై దృష్టి పెట్టారు. తొలిరోజే ఎలాగైనా సినిమా చూసేయాలనే కోరికతో ఆ రోజును జాతీయ సెలవు దినం (నేషనల్ హాలీడే)గా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి 'హీరో యష్‌కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇలా సినిమా రిలీజ్ కోసం సెలవు కావాలని ప్రధానికి లేఖ రాయడాన్ని ఇంకొందరు తప్పు బడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ రవీనా టండన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3amAyz6
No comments:
Post a Comment