Thursday, 11 February 2021

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: అరె.. గుచ్చే గులాబీలాగా! హీరోయిన్‌పై అక్కినేని హీరో ఫీలింగ్స్

హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ''. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ జోడీగా యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్, టీజర్, సిద్ శ్రీరామ్ పాడిన 'మనసా మ‌న‌సా' పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన రొమాంటిక్ సాంగ్‌ 'గుచ్చే గులాబీలాగా' అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుకు ఒకరోజు ముందే అనగా ఫిబ్రవరి 13న ఈ సాంగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ పాటకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ టీజర్ యూత్ ఆడియన్స్‌ని యమ ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఇటీవలే ఈ చిత్ర విడుదల తేదీని కూడా‌ ప్రకటించింది చిత్రయూనిట్. జూన్ 19వ తేదీన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుందని తెలపడంతో ఆ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. టీజర్‌లో 'నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం' అంటూ పూజా హెగ్డే మాటలతో ఆకట్టుకోవడంతో ఈ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నారని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. చూడాలి మరి ఈ మూవీతో అయినా అఖిల్ కెరీర్ టర్న్ అవుతుందా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qdUAm7

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...