Friday, 12 February 2021

‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ.22 కోట్ల షేర్ ఊదేయడం ఖాయమేనా? బాక్సాఫీస్ బాదుడు తొలి రోజు ఎంతంటే?

ఎంత మెగా ఫ్యామిలీ హీరో అయినప్పటికీ డెబ్యూ మూవీకి రూ.22 కోట్ల షేర్ రాబట్టాలంటే చిన్న విషయం కాదు. కానీ కంటెంట్ ఉంటే కోట్లు పెద్ద కష్టం కాదని ‘ఉప్పెన’ చిత్రంతో బ్రేక్ ఈవెన్ మార్క్‌న బీట్ చేయడానికి వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబడుతోంది. చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం నిన్న (ఫిబ్రవరి 12) థియేటర్స్‌లో భారీగా విడుదలైంది. వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి సినిమానే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.50 కోట్లకు విక్రయించగా.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లు కాగా.. మొత్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడానికి సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఒక డెబ్యూ హీరోకి ఇన్నికోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. అయితే ఉప్పెన చిత్రానికి మంచి హైప్ ఉండటంతో పాటు.. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ థియేటర్స్‌లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఆక్యుపెన్సీ ఉండేది. అంటే.. కరోనా వల్ల సీట్ వదిలి సీటు బుకింగ్స్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉండేది. అయితే 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది ఉప్పెన. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు ఉప్పెన చిత్రానికి రూ.7 కోట్ల భారీ ఓపెనింగ్స్ లభించినట్టు తెలుస్తోంది. ఇక శని-ఆదివారాలు రావడంతో పాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో కలెక్షన్లు ఊపందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ అన్నట్టుగా ఇది రూ. 100 సినిమా కావడం డౌటానుమానమే కానీ.. బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను మిగల్చడం అయితే ఖాయంగానే కనిపిస్తోంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిరోజు కలెక్షన్స్‌కి సంబంధించి అధికారిక లెక్కలు విడుదల చేయాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా తొలిరోజు రెండు కోట్లు, మూడు కోట్లు అని పోస్టర్స్ వేసుకుని నానా హంగామా చేస్తున్నాయి. మరి ‘ఉప్పెన’ చిత్ర కలెక్షన్లకు సంబంధించి ఎన్నికోట్ల పోస్టర్ వస్తుందో వేచి చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LN6yUL

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ