Friday, 18 December 2020

Jagadam: నిర్మాతతో సుకుమార్ ‘జగడం’... బన్నీ, మహేష్‌ను కాదని రామ్‌తో

ఓ హీరో నటించాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లడం సినీ ఇండస్ట్రీలో సహజమే. దానికి తెరవెనుక జరిగే ఎన్నో కారణాలుంటాయి. యంగ్ హీరో రామ్‌ కెరీర్‌లో ఇలాగే జరిగింది. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌ నటించిన చిత్రం ‘’. యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయినా నటుడిగా రామ్‌‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే అలాంటి క్యారెక్టర్లో అల్లు అర్జున్, మహేశ్‌బాబు నటిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. Also Read: ఈ సినిమాలో హీరో రోల్ కోసం దర్శకుడు ముందుగా బన్నీగాని, మహేశ్‌ని గానీ అనుకున్నాడట. అయితే ఓ ప్రముఖ నిర్మాతతో విబేధాలు రావడంతో వెంటనే రామ్‌కి కథ వినిపించి ఒప్పించాడట. ఆ నిర్మాతపై కోపంతో ఉన్న సుకుమార్ ‘జగడం’ అనే టైటిల్‌ ఫిక్స్ మరుసటి రోజే పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. అయితే మరీ మాస్ కంటెంట్‌ ఎక్కువ కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మహేష్‌తో ‘1 నేనొక్కడినే’ తెరకెక్కించినా ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక బన్నీకి ‘ఆర్య’తో బ్లాక్‌‌బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. తర్వాత అతడితో ‘ఆర్య 2’ తీశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ తెరకెక్కుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wr1KG9

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....