Wednesday 23 December 2020

F3 Movie: వెంకటేష్, వరుణ్ తేజ్ ఫన్నీ జర్నీ స్టార్ట్.. F3 షూటింగ్ షురూ

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు మరో ప్రయాణం షురూ చేశారు స్టార్ హీరోలు వెంకటేష్‌, వరుణ్‌ తేజ్. అదేనండీ.. గతంలో 2019 సంక్రాంతికి F2 సినిమాతో ఫన్ క్రియేట్ చేసిన ఈ ఇద్దరూ ఇక అంతకుమించిన ఫన్ డోస్ 2021లో ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇటీవలే F2 సినిమాకు సీక్వల్‌గా F3 రాబోతోందని అఫీషియల్‌గా ప్రకటించి తాజాగా సెట్స్ పైకి కూడా వచ్చేశారు. తాజాగా ప్రారంభమైన ఈ F3 షూటింగ్ తొలి రోజు షూటింగ్‌లో విక్టరీ పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ''సెట్లో నవ్వులు మొదలయ్యాయి. షూటింగ్‌ ప్రారంభమైంది'' అని పేర్కొన్నారు. ఈ మేరకు సెట్స్‌పై వెంకీమామతో దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా F3 మూవీ మూవీ గురించిన చర్చలు నడుస్తుండగా.. ఇంతలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడం, షూటింగ్ కూడా ప్రారంభం కావడం ప్రేక్షకుల్లో ఆతృతను పెంచేసింది. F2 సినిమాను డైరెక్ట్ చేసిన‌ అనిల్‌ రావిపూడి F3తో మరోసారి కడుపుబ్బా నవ్వించబోతున్నారు. మోర్ ఫన్ బిగిన్స్ అంటూ ఇటీవలే విడుదల చేసిన పోస్టర్, కాన్సెప్ట్‌ వీడియోకి భారీ రెస్పాన్స్ రావడం చూస్తే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. వెంకటేష్, , తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా రూపొందనున్న ఈ మూవీకి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aG5X14

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...