మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు గారాలపట్టీ వివాహం ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. దీంతో మెగా కుటుంబమంతా పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. అయితే పెళ్లికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వధూవరులు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, పెళ్లికి ఎవరెవరు హాజరవుతారన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. కరోనా కారణంగా కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... ఈ పెళ్లికి చిరంజీవి, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌తో పాటు కొద్దిమంది కుటుంబసభ్యులు, వరుణ్, నిహారిక క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతున్నారట. సినీ ఇండస్ట్రీ పెద్దలను, సన్నిహితులను ఈ పెళ్లికి ఆహ్వానించలేదట. వీళ్లందరి కోసం హైదరాబాద్‌లో భారీస్థాయిలో రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారట. మెగా ఫ్యామిలీలో శుభకార్యమంటే సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంటుంది. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించే పరిస్థితి లేకపోవడంతో ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది మెగా ఫ్యామిలీ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lJTjQw
No comments:
Post a Comment