Monday, 7 December 2020

రామ్‌చరణ్-కొరటాల శివ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణమిదే!

చిత్ర పరిశ్రమలో కొన్ని క్రేజీ కాంబినేషన్లో అనుకోకుండా తెరకెక్కితే.. మరికొన్ని కాంబినేషన్లు ఎంత ప్రయత్నించినా ఏవో కారణాలతో ఆగిపోతుంటాయి. కొత్త నటీనటులు, దర్శకుల విషయంలో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోయినా.. అగ్రహీరోలు, పెద్ద దర్శకుల కాంబినేషన్లను మాత్రం గమనిస్తూ ఉంటారు. అలాంటి చిత్రాలు ఆగిపోతే.. ఎందుకా? అని చర్చించుకుంటారు. మెగా పవర్‌స్టార్ , ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది. Also Read: ప్రభాస్‌తో తన తొలి చిత్రం ‘మిర్చి’ తీసిన తర్వాత కొరటాల శివ. చరణ్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌‌గా మారిన ఆ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లకుండానే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?. శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చింది. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ స్క్రిప్ట్ విషయంలో కొరటాల శివకు నమ్మకం ఏర్పడలేదు. ఎన్ని మార్పులు చేస్తున్నా అనుకున్నట్లుగా రాలేదు. ఇస్తే బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వాలి.. అంతేగానీ ప్రకటించాం కదా అని తొందరపడి సినిమా తీసేస్తే బాగుండదని అనుకున్నాడట శివ. Also Read: ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పగా.. ‘సినిమా తెరకెక్కించాల్సింది మీరు. మీరు చెప్పింది చేయడమే నా పని. కథ, స్ర్కిప్ట్ విషయంలో మీరే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కథ మీరు అనుకున్నట్లుగా ఎప్పుడు వస్తుందో అప్పుడే సినిమా మొదలుపెడదాం’ అని చెప్పాడట. ఈ విషయాన్ని కొరటాల శివ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. మరి భవిష్యత్‌లోనైనా వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందో? లేదో చూడాలి మరి. మరోవైపు మెగాస్టార్‌తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39OQLhB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....