Monday, 7 December 2020

వ్యాపారవేత్తతో అనీషా రెడ్డి ఎంగేజ్‌మెంట్.. విశాల్ పెళ్లి ఆగిపోయినట్లే?

తెలుగు కుటుంబానికి చెందిన కోలీవుడ్లో స్టార్‌ హీరో స్థాయికి ఎదిగాడు. తన సినిమాలు తెలుగులోనూ డబ్ చేస్తూ టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఆయన వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమాయణం కొనసాగించినట్లు కోకొల్లలుగా వార్తలొచ్చాయి. అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డి(‘పెళ్లిచూపులు’ సినిమాలో విజయ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించింది) అనే యువతితో విశాల్‌కు నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రెటీలు హాజరై వారిని ఆశీర్వదించారు. అయితే అప్పటినుంచి వీరి పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికిరాలేదు. దీంతో ఈ పెళ్లి ఆగిపోయిదంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలో నిజం లేదని విశాల్ తండ్రి క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగలేదు. అనీషా తన సోషల్‌మీడియా అకౌంట్లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనీషా రెడ్డికి ఓ యువ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైందట. త్వరలోనే వీరి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారట. Also Read: నిశ్చితార్థం అయిన కొద్దిరోజులకే విశాల్‌, అనీషా మధ్య మనస్పర్థలు వచ్చాయని, దీంతో రెండు కుటుంబాలు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరువర్గాలు సీక్రెట్‌గా ఉంచాయి. తాజాగా అనీషా రెడ్డికి మరొకరితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలు రావడంతో విశాల్ పెళ్లి ఆగిపోయినట్లేనని అభిమానులు క్లారిటీకి వచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JYIk8D

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....