Wednesday, 23 December 2020

మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ భార్య స్పెషల్ గిఫ్ట్.. అసలు కారణమిదే! నమ్రత ఫుల్ ఖుషీ

స్టార్ హీరోల మధ్య స్నేహం ఎప్పుడూ తమ తమ అభిమానులకు తీయని సందర్భమే. ఇద్దరు స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్ ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతుంటుంది. ఈ క్రమంలోనే నేటితరం హీరోలంతా తమ తమ తోటి హీరోలతో బెస్ట్ రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. అంతేకాదు హీరోల భార్యలు కూడా ఈ రిలేషన్ బలపడేలా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, పండుగల వేళ ఒకరినొకరు విష్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య ఓ గిఫ్ట్ పంపించారు. తాజాగా ఆమె పంపించిన ఆ గిఫ్ట్ అందరికీ చూపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు మహేష్ సతీమణి . మహేష్ బాబు ఫ్యూచర్, ఫ్యామిలీ క్షేమం కోరుతూ క్రిస్మస్ కానుకగా చాక్లెట్లు నిండిన ఒక స్పెషల్ బాక్స్ పంపించారు అన్నా లెజనోవా. ఇందులో ఓ ప్రత్యేకమైన నోట్ రాసి పంపడం విశేషం. ''మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తూ, ఈ పవిత్రమైన సీజన్‌లో సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు బావుండాలని, ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నట్లు కోరుకుంటున్నాను. అన్నా, కళ్యాణ్'' అని ఆ నోట్‌లో రాసి ఉంది. ఇందుకు గాను అన్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ నమ్రత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు తెగ సంబరపడుతూ ఇద్దరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KAI8x5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....