Friday, 4 December 2020

సీనియర్ నటి జయచిత్రకు భర్త వియోగం..

సీనియర్‌ నటి, దర్శకురాలు భర్త గణేశ్‌ (62) శుక్రవారం కన్నుమూశారు. తిరుచ్చిలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌లో గల స్వగృహానికి తరలించారు. గణేశ్‌ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. గణేశ్‌ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు కుటుంబానికి చెందిన జయచిత్ర సుమారు 200కి పైగా చిత్రాల్లో కథానాయికగా నటించి అలరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1970–80 కాలంలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే కుంభకోణం ప్రాంతానికి చెందిన గణేశ్‌తో ఆమెకు వివాహమైంది. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఆమ్రేష్‌ వీరి కుమారుడే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oqXdQ1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....