Thursday, 17 December 2020

సీరియల్‌లో శృంగార సన్నివేశాలు.. చిత్ర క్యారెక్టర్‌పై భర్త నిందలు.. దర్యాప్తులో కీలక విషయాలు

బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఆమె భర్త హేమంత్‌‌ని గురువారం ఆర్డీవో విచారించారు. ఈ నెల 9వ తేదీన చెన్నై నజరత్‌పేట్టైలోని ఓ హోటల్‌లో చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరు రోజుల విచారణ అనంతరం భర్త వేధింపుల వల్లే చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించి హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. Also Read: చిత్ర క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్న హేమంత్ ఆమెను తరుచూ వేధింపులకు గురిచేసేవాడని విచారణలో వెల్లడైంది. ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి సీరియల్‌ షూటింగ్‌లో భాగంగా సహ నటుడితో చిత్ర శృంగార భరిత సన్నివేశంలో నటించిందని, ఆ తర్వాత హోటల్‌కి వచ్చిన చిత్రతో హేమంత్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. షూటింగ్‌ను అడ్డం పెట్టుకుని చిత్ర క్యారెక్టర్‌పై అతడు నిందలు వేశాడని, ఆ అవమానం తట్టుకోలేకే చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. Also Read: గురువారం హేమంత్‌ను ఆర్డీవో దివ్యశ్రీ విచారణ చేపట్టారు. పొన్నేరి సబ్‌జైలు అధికారులు అతడిని గురువారం భారీ బందోబస్తు మధ్య శ్రీపెరుంబుదూరులోని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో అడిగిన పలు ప్రశ్నలకు హేమంత్ సమాధానమిచ్చాడు. ఆర్డీవో అతడి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు హేమనాథ్‌ను ప్రత్యేక వాహనంలో పొన్నేరి సబ్‌జైలుకు తరలించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37tltex

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....