Sunday, 6 December 2020

పెళ్లి వేదికకు బయల్దేరిన నిహారిక.. నాగబాబు, వరుణ్ తేజ్‌ సహా ఫ్లైట్ ఎక్కేసిన మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ సంబరాలు మిన్నంటుతున్నాయి. పెళ్లికి వారం ముందునుంచే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరడంతో హైదరాబాద్ లోని నాగబాబు ఇంట సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి కూతుళ్లు శ్రీజ, సుస్మిత.. నిహారికకు తోడుగా ఉంటూ పెళ్లి కూతురుకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటున్నారు. శనివారం, ఆదివారం నిహారికకు ప్రత్యేకంగా ముస్తాబు చేసి పెళ్లి కూతురును చేశారు. మెగా ఇంట పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నాగబాబు ఇల్లును అందంగా అలంకరించి గ్రాండ్ లుక్ తీసుకొచ్చారు. ఇదిలాఉంటే డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ పూర్తి చేసిన వరుణ్ తేజ్.. కొద్దిసేపటి క్రితం కొత్త పెళ్లికూతురు, తన చెల్లెలు నిహారికకు తీసుకొని పెళ్లి వేదికకు బయల్దేరారు. నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ప్రత్యేకంగా ఓ ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్ వెళ్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లాడనుంది. ఈ శుభకార్యానికి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ హాజరై సందడి చేయనున్నారు. అనంతరం సినీ, రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సన్నిహిత వర్గాల కోసం హైదరాబాద్‌లో స్పెషల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VOfn1M

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....