Sunday, 20 December 2020

చిరంజీవి నన్ను చూసి ఇబ్బంది పడ్డారు: సోనూసూద్

లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ ఇకపై సినిమాల్లో విలన్‌గా చేయనని చెబుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోనూ అలా వ్యాఖ్యానించడానికి కారణం మెగాస్టార్ చిరంజీవట. 152వ సినిమా ‘ఆచార్య’లో విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే చిరు, సోనూ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఫైట్‌లో భాగంగా సోనూసూద్‌ని కొట్టడానికి చిరంజీవి ఇబ్బంది పడ్డారట. ‘కోవిడ్‌ సమయంలో ఎంతో సేవ చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నావు. నిన్ను కొడితే ప్రేక్షకులు నాపై కోపం పెంచుకుంటారు’ అని చిరంజీవి అన్నారట. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా తెలిపాడు. తాను ఏ సినిమా షూటింగ్‌కి వెళ్లినా అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని, అందువల్ల ఇకపై తాను విలన్‌గా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సోనూసూద్ తెలిపాడు. తనకు హీరోగా చాలా అవకాశాలు వస్తున్నాయని, ఇప్పటికే నాలుగు స్ర్కిప్టులు రెడీగా ఉన్నాయని సోనూసూద్ తెలిపాడు. కొత్త సంవత్సరంలో హీరోగా కొత్త కెరీర్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తుకున్నట్లు వెల్లడించాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3h9nfFc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....