Thursday, 17 December 2020

Anna Lezhneva: ఎయిర్‌పోర్ట్‌లో అలా కెమెరాకు చిక్కిన పవన్ కళ్యాణ్ భార్యాపిల్లలు.. షాకైన మెగా ఫ్యాన్స్‌!

నిహారిక పెళ్లి వేడుక మొదలైనప్పటి నుంచి ఫ్యామిలీ సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, అలాగే ఆయన భార్య కనిపించకపోవడంపై పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇష్యూపై ఇటీవలే రేణు దేశాయ్ స్పందిస్తూ తాను షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే నిహారిక పెళ్లికి రాలేకపోయాను తప్ప వేరే కారణం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన పిల్లలతో అన్నాలెజ్‌నేవా ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతాకూడా పవన్ భార్య అన్నాలెజ్‌నేవా రష్యాలో ఉందని అనుకుంటుండగా.. సడెన్‌గా ఆమె హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడం హాట్ టాపిక్ అయింది. ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలేనా అంజనా పవనోవాలతో అన్నాలెజ్‌నేవా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జీన్స్, టీషర్టు వేసి ట్రెండీగా కనిపించింది పవన్ భార్య. ఈ ఫొటోలు చూసి కొందరు పవన్ ఫ్యాన్స్ మురిసిపోతుండగా, ఇంకొందరు కొత్త అనుమానాలకు తెరలేపుతున్నారు. నిహారిక పెళ్లికి అకీరా నందన్, ఆధ్యలతో కలిసి పవన్ అటెండ్ అయ్యారు. కానీ అన్నాలెజ్‌నేవా, ఆమె పిల్లలు హాజరు కాకపోవడంతో ఒక్కసారిగా జనమంతా దీనిపైనే దృష్టి పెట్టారు. అయితే అన్నాలెజ్‌నేవా తన పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్లిన కారణంగానే నిహారిక పెళ్లికి హాజరు కాలేకపోయారని తెలియడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఇంతలో క్రిస్మస్ ముగియక ముందే వీళ్లు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. దీంతో నిహారిక పెళ్లికి అన్నాలెజ్‌నేవా వెళ్లకపోవడానికి అసలు కారణం రష్యా వెళ్లడం కాదని, ఏదో పర్సనల్ రీజన్ ఉండే ఉంటుందని చెప్పుకుంటున్నారు జనం. కాగా, మెగా వేడుకలో భాగం కాని పవన్ భార్య అన్నా.. నిహారిక కోసం ఓ ప్రత్యేకమైన బహుమతి పంపించిందని విన్నాం. ఏదేమైనా మరోసారి పవన్ ఫ్యామిలీ మ్యాటర్ జనాల్లో చర్చల్లో నిలవడం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r8Mo7y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....