Wednesday, 1 April 2020

ప్రభాస్‌ను ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 14 వరకుజనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ఆర్థికంగానూ కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు.. సినిమా సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలకు అండగా నిలిచారు.. తోచిన సాయం చేస్తున్నారు. కరోనా రిలీఫ్ కోసం సాయం అందించిన టాలీవుడ్ హీరో ప్రభాస్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తేశారు. బాహుబలి చిత్ర రికార్డుల్లోనే కాదు, కరోనా విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయం అన్నారు. చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3కోట్లు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ.కోటి ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రభాస్‌తో పాటూ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమకు తోచిన సాయాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలను ప్రకటించారు. అలాగే ప్రముఖ వ్యాపారులు, సంస్థలు, ప్రజా ప్రతినిధులు కూడా కరోనా రిలీఫ్ కోసం తమవంతు సాయాన్ని అందించారు. ప్రజలు, ప్రభుత్వాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JuvaN1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....