Monday, 6 April 2020

స్టార్ కమెడియన్ మృతి.. ఇండస్ట్రీలో వరుస మరణాలు

ఒకవైపు కరోనా విజృంభనతో ఇండస్ట్రీలు అల్లాడుతుంటే వరుస మరణాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌లో రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణ‌వేణి సోమవారం నాడు మరణించగా.. కన్నడ స్టార్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా లివర్ ఇన్ఫెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కన్నడ స్టార్ కమెడియన్ ‘బుల్లెట్’ ప్రకాశ్ (42) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కాగా, కన్నడ, తమిళ్ మరియు ఇతర భాషల్లో 325 పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్‌ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు. వైవిధ్యమైన శైలితో ఈయనకు ‘బుల్లెట్’ భాస్కర్ అనే పేరు వచ్చింది. ‘మస్త్‌ మజా మాది’, ‘అయితలకడి’, ‘మల్లిఖార్జున’, ‘ఆర్యన్‌’ సినిమాలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. కన్నడ ‘ధృవ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి.. శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, దర్శన్‌, ఉపేంద్ర, సుదీప్‌ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌-2లో కూడా ఆయన పాల్గొన్నారు. ప్రకాశ్ మృతికి పలువురు కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Rjsar8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....