Monday, 20 April 2020

ఫ్రీ టైమ్.. అంతా అదే కావాలని అడుగుతున్నారు.. వీడియోతో రంగంలోకి బోల్డ్ బ్యూటీ

కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎవరికి తోచినట్లుగా వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమలో దాగి ఉన్న టాలెంట్ బయటపెడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు చేస్తూ వీడియోలు రూపొందిస్తుండగా, మరికొందరు సెల్ఫ్ వీడియోలు చేస్తూ ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హాట్ బ్యూటీ హంసానందిని రంగంలోకి దిగి అమ్మాయిలకు మేకప్ మెళకువలు నేర్పింది. ఈ మేరకు మేకప్ టెక్నిక్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది హంసానందిని. ''మై బోల్డ్ లిప్స్ అండ్ న్యూట్రల్ సెక్సీ ఐస్'' అనే పేరుతో మేకప్ ట్యుటోరియల్ వీడియో తయారుచేసి దాన్ని తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టింది. తన ఫోటోలు చూసి.. చాలామంది అమ్మాయిలు మీ మేకప్ రహస్యం ఏంటని అడుగుతున్నారని, ఈ వీడియో వాళ్లకు ఉపయోగపడుతుందని పేర్కొంటూ ట్విట్టర్‌లో ఆ వీడియో పోస్ట్ చేసింది హంసా. అమ్మాయిలకు మేకప్ పాఠం, అబ్బాయిలకు అందాల విందు అన్నట్లుగా ఉన్న ఈ వీడియో క్లిప్‌పై క్వారంటైన్ టైమ్, సెల్ఫ్ లవ్ అనే హ్యాష్‌టాగ్స్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. Also Read: ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాలో టైటిల్ సాంగ్, అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' లాంటి యూత్ ఓరియెంటెడ్ సాంగ్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టిన ఐటెం బ్యూటీగా పాపులర్ అయింది. ఈ మధ్యకాలంలో ఆఫర్స్ తగ్గిపోవడంతో సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ హంగామా చేస్తోంది హంసానందిని. ఈమె అందానికి ఆకర్షితులు చాలా ఎక్కువండోయ్!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34SeY21

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....