Sunday, 7 November 2021

అల్లు స్నేహారెడ్డి కోసం స్పెషల్‌గా.. సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ మామూలోడు కాదు.. టూ హాట్!

స్టైలిష్ట్, డిజైనర్‌గా ప్రీతమ్ పేరు మార్మోగిపోయింది. గతంలో ఓసారి ప్రీతమ్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోను సమంత షేర్ చేయడంతో అతగాడు లైమ్ లైట్‌లోకి వచ్చాడు. సోఫా మీద ఇద్దరూ కూర్చోవడం.. అందులోనూ సమంత తన కాళ్లను ప్రీతమ్ ఒళ్లో పెట్టుకుని ఉండటం, ఐ లవ్యూలు అంటూ చెప్పుకోవడంతో ఆ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులు హర్ట్ అయ్యారు అప్పుడు. ఆ తరువాత సమంత ఆ ఫోటోను డిలీట్ చేసేసింది. వివాదానికి అక్కడితో పుల్ స్టాప్ పెట్టేసింది. అయితే సమంత నాగ చైతన్య విడాకుల విషయంలోనూ పేరు ఎక్కువగా వినిపించింది. ప్రీతమ్ వల్లే వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందంటూ నానా రకాల చెత్తంతా రాశారు. చివరకు సంబంధాలు కూడా అంటగట్టేశారు. కానీ తాను సమంతను అక్క అని పిలుస్తాను అని, ఆ విషయం చైతూకి కూడా తెలుసంటూ.. ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు. కానీ శ్రీరెడ్డి ఈ విషయంలోకి దూరింది. ప్రీతమ్ గే అంటూ ఓ బాంబ్ పేల్చింది. అందులో ఎంత నిజమున్నది అనేది ఆమెకే తెలియాలి. ఇక సమంత స్టైలిష్ట్‌, డిజైనర్గా ప్రీతమ్ వెరైటీ వెరైటీ దుస్తులను క్రియేట్ చేస్తుంటాడు. అలానే ఈ దీపావళికి అదిరిపోయే కలెక్షన్లను రెడీ చేశాడు. ఇక అల్లు స్నేహారెడ్డికి కూడా ప్రీతమ్ స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీపావళికి ప్రీతమ్ రెడీ చేసిన డ్రెస్‌లో అదిరిపోయింది. ఇక తాజాగా స్నేహారెడ్డి షేర్ చేసిన ఫోటోలోనూ అదిరిపోయింది. ఆ దుస్తులు కూడా ప్రీతమ్ డిజైన్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇక అల్లు స్నేహారెడ్డి ఫోటో మీద శ్రియా కామెంట ్ చేసింది. టూ హాట్ అని అంటే.. థ్యాంక్యూ అని శ్రియాకు స్నేహారెడ్డి రిప్లై ఇచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EMVSLq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....